సొట్ట ఆధి గాడు - వంశీ కథ - సమీక్ష

 వంశీ సొట్ట ఆధి గాడు కథ సమీక్ష  


Vamsi Book Kachhitanga naaku telusu Book Review

వంశీ  కథ లు అంటేనే  గోదావరి , తెలుగుతనం , పచ్చని పల్లెలు కనువిందు చేసే ప్రకృతి , మనసుకు హత్తుకునే పాత్రలు . 




 వంశీ కొత్త పుస్తకం 'కచ్చితంగా నాకు తెలుసు' లోని మొదటి  కథ సొట్ట ఆది గాడు . ఈ కథ కూడా వంశీ కథలు అన్నింటిలానే గోదావరి పరిసర ప్రాంతాలలోనే ప్రారభం అవుతుంది . 

గోపీలంక అనే చక్కని పల్లెలో సాగే ఈ కథ లో వంశీ వర్ణన గోదావరి పక్కనే మనం ఉన్నట్టు గా అనిపిస్తుంది . 

ఈ గ్రామం లో ఉండే రాజులు వేరే ఊరు లో ఉంటూ ఉంటారు .వీరి గుమస్తాలు ఇక్కడ రాజుల పంటలు చూస్తూ ఉంటారు . 

ఇక్కడ ఉండే గంగాలమ్మ  తల్లి అనే గ్రామ దేవత రాత్రి పూట పంట పొలాలని కాపలా కాస్తూ దొంగలు రాకుండా చూస్తూ ఉంటుంది .  

ఎవరైనా దొంగ తనానికి వస్తే అక్కడే రక్తం కక్కుకుని చచ్చి పోతూ ఉంటారు .  ఆ గ్రామ ప్రజలకు ఆ గంగాలమ్మ తల్లి అంటే భక్తి తో పాటు భయం కూడా ఉంటుంది . 

 ప్రతీ ఏడు ఒకరోజు వచ్చి రాజులు ఒక సంబరం జరిపిస్తూ ఉంటారు గంగాలమ్మ తల్లి కి .


అదే ఊళ్ళో ఉండే గుట్టల ఆదయ్య  ని అందరూ సొట్ట ఆధి గాడు అంటూ ఉంటారు . చాలా కస్టపడి  పనిచేసే సొట్ట ఆధి గాడు నోరు మాత్రం మంచిది కాదు అంటూ ఉంటారు ఊళ్ళో వాళ్ళు . 

 రావికంపాడు రాజుల దగ్గర పని లో చేరిన సొట్ట ఆధి గాడు సంబారానికి  వచ్చిన రాజుల తో నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు . దానితో ఆ రాజులు కు కోపం వచ్చి పనిలో నుండి తీసేస్తారు . 

తరువాత అలాగే ఇద్దరు ముగ్గురు దగ్గర  పనిలో  చేరి నోటికి వచ్చినట్టు గా మాట్లాడతాడు. వాళ్ళు కూడా పని లోనుండి తీసేస్తారు. 


నోటికి వచ్చి నట్టు  మాట్లాడే సొట్ట   ఆది గాడి  ని ఎవరూ పనిలో పెట్టుకోరు . చివరకి పని దొరక్క ఆకలి తో ఉంటాడు సొట్టది గాడు . అంతే కాకుండా కుటుంబం మొత్తం ఆకలితో ఉండే సరికి ఓరోజు ఆకలి తట్టుకోలేక దొంగతనానికి బయలుదేరతాడు . ఐతే ఆ రాత్రి దొంగతనం లో గంగాలమ్మ తల్లి సొట్ట ఆధిగాడి ని చంపేసిందా లేదా అనేది ఈ కథ . కథ చివరి వరకు చాలా ఆసక్తికరం గా మలిచారు వంశీ . 

కథ మొత్తం గోదావరి పరిసర ప్రాంతాలు వర్ణన , అక్కడి పరిస్థి లను మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది .


 కథ మొత్తం చదువుతుంటే  కోనసీమ ప్రాంతాలో మనం విహరించి నట్టు , గోదావరి ఒడిలో మనం ఆడుకున్నట్టు  గా అనిపిస్తుంది . 


తప్పక చదవితీరాల్సిన కథ సొట్ట ఆధి గాడు . వంశీ కచ్చితంగా నాకు తెలుసు కథల పుస్తకం లోని ఇతర కధలు గురించి మరో సందర్భంలో తెలుసుకుందాం. 


పుస్తకం : వంశీ కచ్చితంగా నాకు తెలుగు కధలు 

అన్వీక్షికి పబ్లిషర్స్ , హైదరాబాద్ 


ఇవి కూడా చదవండి

మతి లేని సాక్ష్యం

ఈనాడు ఆదివారం కథలు

అద్భుత దేవాలయాలు









Post a Comment

కొత్తది పాతది