తొందరపడితే!


కొన్నిసార్లు తొందరలో తీసుకునే నిర్ణయాలు అనార్ధాలుకు  దారి తీస్తాయి. అందుకే పెద్దవాళ్ళు ఆలోచించకుండా ఏ పని చేయకూడదు అని చెప్తూ ఉంటారు. తొందరపడితే  జరిగే అనార్ధానికి ఈ పిల్లల నీతి కథ (Kids moral story ) ఒక ఉదాహరణ.

Kids Moral story in telugu


ఒక ఊరిలో కుమార వర్మ అని ఒక పండితుడు ఉండేవాడు. ఆయన  భార్య, రెండు నెలల బాబు తో ఊరి చివర అందమైన గుడిసె లో నివసించేవాడు.


కుమార వర్మ అందమైన గుడిసె ఊహ చిత్రం


 ఎన్నో రకాల పూల మొక్కలు, చెట్లు ఆయన ఇంటి చుట్టూ ఉండేవి. ఒకరోజు కుమార వర్మ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే, ఆయన ఒక ముంగిస ను గమనించాడు. ఆ ముంగీస కదల లేకుండా ఉంది. దాని కాలికి గాయం అయ్యింది. దానిని చుసిన కుమార వర్మ కు జాలి కలిగింది. దాని కాలికి మందు రాసి కట్టు కట్టి అది తినడానికి కొన్ని దుంపలు పెట్టాడు. ప్రతీ రోజు దానికి ఆహారం అందిస్తూ ఉన్నాడు. కొద్ది రోజులకు ఆ ముంగీస గాయం తగ్గిపోయింది. కానీ అది ఎక్కడికి వెళ్లకుండా కుమార వర్మ ఇంటి పరిసరాలులో నే తిరుగుతూ ఉండేది. అక్కడ ఉన్న చెట్ల కిందనే పడుకునేది.  కుమార వర్మ భార్య నీలవేణి దానికి అప్పుడప్పుడు ఇంట్లో మిగిలి పోయిన అన్నం, కూరలు పెట్టేది. వర్షాకాలం బయట వర్షం పడుతున్నా, చలి గా ఉన్న  కుమార  వర్మ ఇంట్లో ఒక పక్కగా ముంగీస పడుకునేది. ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకునేది కాదు. మళ్ళీ వర్షం తగ్గిపోయాక బయటకు వెళ్లిపోయేది. ఆలా ఆ ముంగీసకు ఆ ఇల్లు అక్కడి మనుషులు నేస్తాలు అయ్యిపోయారు.


ఒక వర్షాకాలం సాయంత్రం కుమార వర్మ బయటకి వెళ్ళాడు. నీలవేణి వంటగది లో పని లో ఉంది . ఆ సమయం లో ఎక్కడి నుండి వచ్చిందో  కానీ ఒక పాము అక్కడికి వచ్చింది. కుమార వర్మ బాబు అక్కడే ఒక చాప మీద పడుకుని ఉన్నాడు.  పాము నెమ్మదిగా పాకుతూ ఆ బాబు దగ్గరకు వెళ్తూ ఉంది .

కుమార వర్మ ఇంటిలోకి వచ్చిన పాము ఊహ చిత్రం 



అక్కడే పక్కగా పడుకుని ఉన్న ముంగీస ఆ పాముని చూసింది. వెంటనే పరుగు పరుగున వెళ్లి ఆ పాము ని కరిచి దానిని చంపేసింది. బాబు ని పాము బారినుండి కాపాడినందుకు గర్వం గా, అనందం గా పొంగిపోయింది. పాము ను చంపాను, అని నీలవేణి కి తెలియ చేయాలి అని వంటగాది లోకి వెళ్లి నీలవేణికి కనబడింది.


ముంగీస నోటికి ఉన్న రక్తం చూసి

నీలవేణి కంగారు పడింది. బాబు ని ముంగీస ఏం చేసిందో అని అనుకుంటూ పక్కనే ఉన్న పచ్చడి బండ తీసుకుని ముంగీస పై విసిరింది. ఆ పచ్చడి బండ గట్టిగ తగలడం తో ముంగీస అక్కడి కక్కడే చచ్చి పోయింది. వెంటనే బాబు దగ్గరకి వెళ్లి చూసింది నీలవేణి. అక్కడ బాబు పడుకుని ఉన్నాడు. పక్కనే పాము రెండు ముక్కలుగా చచ్చి పడి ఉంది. అప్పుడు అర్ధం అయ్యింది నీలవేణి  కి జరిగిన సంగతి. అయ్యో తొందరపడి ముంగీసను చంపేశాను అని బాధ పడింది.

Moral in Kids telugu story 

తొందరపడి ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు అని మనకు ఈ పిల్లల తెలుగు కథ తెలియ చేస్తుంది.

తెలుగు లో ఉన్న ఎన్నో పిల్లల నీతి కధలు వినోదాన్ని పంచడమే కాకుండా, విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి .



కథ : పనికే విలువ 

కథ : మతి లేని సాక్ష్యం 

Post a Comment

కొత్తది పాతది