ఓటు విలువ మరువకు నాయకా


ఓటు విలువ : గాదె రమేష్ 


కలసి రాని కాలమొస్తే.....
నీ తల రాతే మారిపోతే.....
జై!  కొట్టిన  జనం నిన్ను
'ఛీ' కొట్టక మానరు నాయకా!
జనం ఓటుందని మరువకు నాయకా!

ఇచ్చిన హామీలు మరిచిపోతే...
గాలి మూటలని తేలిపోతే....
జై!  కొట్టిన జనం నిన్ను
తరిమి కొట్టక మానరు నాయకా!
జనం ఓటు విలువ తెల్సుకో నాయకా!

ఎన్నుకున్న యేడాదికయినా
కానరాక  కథలెన్నో అల్లితే....
జై! కొట్టిన  జనం నిన్ను
తిరిగి పంపక మానరు నాయకా!
జనం నోటుకు లొంగరు నాయకా!

ధరలు పెరిగి గతులు తప్పితే...
జనం విసిగి వేసారి పోతే....
జై!  కొట్టిన  జనం నీకు
బై! బై! చెప్పక మానరు నాయకా!
జనం ఓటు  బలం అదే నాయకా!

నిరుద్యోగుల నీరుగార్చితే....
నీ మాటలు నీటి మూటలయితే...
జై! కొట్టిన  యువత  నీకు
శెలవు చెప్పక మానరు నాయకా!
ఓటు  ధీటును  మరువకు నాయకా!

గళం యెత్తి గర్జించినా....
గతం చేసినవన్ని యెన్ని సెప్పినా....
జై! కొట్టిన జనం నిన్ను
గద్దె దింపక మానరు నాయకా!
జనం ఓటు  ఒకటుంది నాయకా!




Post a Comment

కొత్తది పాతది