బతుకమ్మ! మళ్ళీ రావమ్మా!

 



బతుకమ్మ మళ్ళీ రావమ్మా
- గాదె రమేష్ 



బంతి పూలతో ఉయ్యాలో...

బంగారు బతుకమ్మ ఉయ్యాలో

మళ్లీ రావమ్మా ఉయ్యాలో....

మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో..

చామంతి పూలతో  ఉయ్యాలో.

చక్కని మాయమ్మ ఉయ్యాలో..

చల్లంగా రావమ్మా ఉయ్యాలో...

మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో..

గునుగు పూలతో ఉయ్యాలో...

గుడికొలను చేరేవు ఉయ్యాలో.

గుర్తుండి రావమ్మా ఉయ్యాలో..

మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో.

తంగేడు పూలతో ఉయ్యాలో..

తళ తళ మెరిసేవు  ఉయ్యాలో

మళ్లీ రావమ్మా ఉయ్యాలో.....

మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో.

పసుపు కుంకుమతోఉయ్యాలో

పసిడిగా మెరిసేవు ఉయ్యాలో

మళ్లీ రావమ్మా ఉయ్యాలో.....

మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో

నవ రత్నాలనిస్తిని ఉయ్యాలో

నవ ధాన్యాల నిస్థిని ఉయ్యాలో

మళ్లీ రావమ్మా ఉయ్యాలో....

మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో.

పాయస మిస్తిని ఉయ్యాలో...

పరమాన్నమిస్తీని ఉయ్యాలో..

మళ్లీ రావమ్మా ఉయ్యాలో....

మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో

పులిహోర నిస్తీని ఉయ్యాలో..

పండ్లు కూర లిస్తిని ఉయ్యాలో

మళ్లీ రావమ్మా ఉయ్యాలో....

మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో.



గాదె రమేష్.                             హైదరాబాదు.



Post a Comment

కొత్తది పాతది